ఈ మాసంలో ఉదయాన్నే స్నానం చేసి .. వాకిట్లో ముగ్గులు పెట్టాలి. ముగ్గుల మధ్య గొబ్బెమ్మల నుంచి వాటిని పూలతో అలంకరించాలి. గడపకి పసుపు కుంకుమలు ... గుమ్మానికి పచ్చని తోరణాలు ఉండేలా చూసుకోవాలి. అనునిత్యం గోదాదేవి సమేత రంగనాథస్వామిని పూజిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన గోదా సమేత రంగనాయకస్వామి అనుగ్రహంతో మనసుకి నచ్చిన వారితో వివాహం జరుగుతుందని పండితులు అంటున్నారు.
లక్ష్మీదేవి అంశతో అవతరించినదిగా చెప్పబడుతోన్న గోదాదేవి, మధురభక్తికి నిలువెత్తు నిర్వచనంలా కనిపిస్తూ ఉంటుంది. రంగనాథస్వామిని మనస్పూర్తిగా ప్రేమించిన ఆమె ఆయనని భర్తగా పొందాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ధనుర్మాసంలో స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తుంది.