లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తే..?

బుధవారం, 12 నవంబరు 2014 (18:45 IST)
లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలు, శ్రవణా నక్షత్రం రోజున లేదా సాధారణ శుక్రవారాల్లో లక్ష్మీదేవి పూజ సిరిసంపదలను చేకూరుస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున ఆ తల్లిని ఆరాధించడం శుభప్రదం. 
 
సాధారణంగా .. సిరులను ప్రసాదించే శ్రీమహాలక్ష్మిని వివిధ రకాల పూలతో పూజించడం జరుగుతుంది. అయితే ప్రత్యేకించి శుక్రవారాల్లో అమ్మవారిని తామరపూలతో పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
శుక్రవారం అమ్మవారిని తామరపూలతో పూజించి .. అందులోని కొన్ని పూలను ధనాన్ని భద్రపరిచే చోట వుంచడం వలన సంపదలు వృద్ధి చెందుతాయని పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి