ఓ దేవకీ నందనా..! ఓ వృష్టివంశ మంగళ దీపమా..! సుకుమార శరీరుడా..! మేఘశ్యామ! భూభారనాశక ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!
అనే మంత్రముతో శ్రీహరిని ప్రతినిత్యం కొలిచిన వారికి మోక్షమార్గములు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో జన్మించిన దేవునిగా మనకందరికీ ఆ పరమాత్ముడు బాగానే తెలుసు. నవభారత నిర్మాణానికి సూత్రధారుడైన శ్రీకృష్ణ పరమాత్మను నిష్ఠనియమాలతో ప్రతి రోజూ పూజించే వారికి ఎలాంటి చింతలుండవని పండితులు చెబుతున్నారు.
అంతేగాకుండా.. శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్లి తామర వత్తులతో, నేతితో గానీ, నూనెతో గానీ దీపం వెలిగించే వారికి సర్వ పాపాలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు.