వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం చేస్తారు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆహ్వానం, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి.
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. అనవసర జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచింపవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. పిల్లల విజయం సంతోషం కలిగిస్తుంది. అనుకోని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఆచితూచి అడుగేయండి. దుబారా ఖర్చులు విపరీతం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు.
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. దంపతుల అవగాహన నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు.
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆశీస్సులందుకుంటారు. అందరితోనూ కలుపుగోలుగా మెలుగుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులను సంప్రదిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ఆదాయానికి తగ్గటుగా ప్రణాళికలు వేసుకుంటారు. సన్నిహితులతో సంభాషిస్తారు. కొత్తపనులు మొదలెడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు.
లావాదేవీలు ముగుస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు సామాన్యం. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు.
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మస్థైర్యంతో అడుగులేస్తారు. సన్నిహితుల సలహా పాటిస్తారు. ఖర్చులు సామాన్యం. ధనసహాయం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. వాహనం ఇతరులకివ్వవద్దు.
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అభిష్టం నెరవేరుతుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. నోటీసులు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆత్మీయులు ఆదుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.