ప్రణాళికలు వేసుకుంటారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు.
ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం తీసుకుంటారు. పనులు వాయిదా పడతాయి. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం జాగ్రత్త. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య సఖ్యతత నెలకొంటుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. రుణసమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు సామాన్యం. నిదానంగా పనులు పూర్తిచేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు.
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితులు సాయం అందిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వ్యవహారాలతో తలమునకలవుతారు. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.
శుభవార్త వింటారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. మీ దృష్టి మరల్చేందుకు కొందరు యత్నిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతకు గురవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. సమర్ధతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మొండిబాకీలు వసూలవుతాయి. అర్థాంతంగా పనులు ముగిస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. కొత్త పనులు మొదలెడతారు. ఖర్చులు విపరీతం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త, స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు.
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. ఒక సమాచారం సంతోషాన్నిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని ఏమరుపాటుగా వదిలి వెళ్లకండి.
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు ముందుకు సాగవు. ఆత్మీయులను కలుసుకుంటారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యంలో పాల్గొంటారు.