మా ఇంటికి ప్రక్కనే ఏడాది క్రితం పెళ్లయిన కొత్త జంట అద్దెకు దిగారు. వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉంటారు. ఇల్లు అద్దెకు దిగాక ఓ పండుగ ఫంక్షనుకు ఆమె మమ్మల్ని పిలిచారు. అమ్మ, నేను వెళ్లాము. వారి ఇంటికి వెళ్లగానే ఆమె భర్త పలుకరింపుగా నవ్వుతూ మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు. ఎందుకో... ఆ నవ్వు సూటిగా నా గుండెల్లో గుచ్చుకున్నట్లనిపించింది. ఫంక్షన్ జరుతున్నంతసేపూ అతడినే చూస్తూ ఉండిపోయాను.
మంచి మనసు, మంచి ఆహ్లాదకరమైన నవ్వు, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులు... అంటే, వారు స్త్రీ లేదా పురుషుడు... ఎవరైనా కావచ్చు. వారంటే సహజంగా ఇష్టం ఏర్పడుతుంది. ఐతే ఆ ఇష్టం అంతవరకే ఉండాలి. కానీ పరాయి స్త్రీ భర్తను కావాలనుకునే స్థాయికి వెళ్లకూడదు. కనుక మీరు మరీ అతడి ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నట్లయితే కొన్నాళ్లు మీ బంధువుల ఇంటికి వెళ్లండి. మనసును కెరీర్ పైన నిలిపి, మీ తల్లిదండ్రులు మీపై ఉంచిన ఆశలను నెరవేర్చేందుకు నడుం బిగించండి. అవన్నీ మీ కళ్లముందు ఉంటే ఇలాంటి పక్కింటి పురుషుని నవ్వులన్నీ మీ ముందు మరుగుజ్జులా మారిపోతాయి.