ఆషాఢ అమావాస్య.. అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం..?

సెల్వి

గురువారం, 4 జులై 2024 (20:55 IST)
ఆషాడ మాసం ప్రత్యేకం. ప్రతి తెలుగు నెల చివర్లో వచ్చే అమావాస్య రోజు పితృదేవతలను పూజిస్తారు.. ఆషాడంలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకం. ఈ రోజు పవిత్ర నదుల్లో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెడతారు. 
 
దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య కావడంతో  ఈ రోజు పితృదేవతలను పూజిస్తే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఇక ఆషాఢ అమావాస్య రోజున దాన‌ధ‌ర్మాలు చేయ‌డం వ‌ల్ల శుభ‌ఫ‌లితాలు క‌లుగుతాయ‌ని విశ్వ‌సిస్తారు.
 
ఈ సంవత్సరం జూలై 5వ తేదీన ఉదయం 4. 45 నిమిషాలకు ఆషాడ అమావాస్య వస్తుంది. ఇది మరుసటి రోజు జులై ఆరవ తేదీ శనివారం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాలకు ముగుస్తుంది. తిథి ప్రకారం జూలై 5న ఉదయం అమావాస్య జరుపుకుంటారు. 
 
ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఆషాడ అమావాస్య రోజు ఉప్పు, పంచదార, బియ్యం పిండి దానం చేస్తే మంచి జరుగుతుంది. పేదలకు అన్నదానం చేసినా ఫలితం ఉంటుంది. ఎవరితోనూ పొరపాటున కూడా గొడవలు పడకూడదు. భిక్షగాళ్లను నిర్లక్ష్యం చేయకూడదు. వృద్ధులను అవమానించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు