ఫాల్గుణ అమావాస్య 2024: తెల్లటి పూలు, నల్ల నువ్వులు సమర్పిస్తే?

సెల్వి

శనివారం, 9 మార్చి 2024 (21:04 IST)
ఫాల్గుణ అమావాస్య ఆదివారం (మార్చి10) రానుంది. ఈ రోజున చేసే దానధర్మాలు, మంత్ర పఠనం.. కోటి రెట్లు ఫలితాలను ఇస్తాయి. ఈ రోజూన పూర్వీకులకు అన్న ప్రసాదం సమర్పించాలి. ఈ రోజు పూర్వీకులను గౌరవించేందుకు అంకితం చేయబడింది. 
 
పితరులకు శ్రాద్ధం ఇవ్వడం మరిచిపోకూడదు. మౌన వ్రతం ఆచరిస్తారు. ఫాల్గుణ అమావాస్య రోజున గంగలో పవిత్ర స్నానం చేయడం శుభప్రదం. భగవద్గీత పఠనం, రామనమాలను పఠించడం శుభఫలితాలను ఇస్తుంది. గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.  
 
ఫాల్గుణ అమావాస్య రోజున తెల్లటి పూలు, నల్ల నువ్వులనూ ఒక కుండ నీటిలో వేసి పూర్వీకులకు నైవేద్యంగా సమర్పించాలి. పూర్వీకులకు నీరు సమర్పించాలంటే అరచేతిలో నీరు తీసుకుని బొటనవేలు వైపు నుంచి నైవేద్యం పెట్టాలి. అరచేతిలో బొటన వేలు ఉన్న భాగాన్ని పితృతీర్థం అని పిలుస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు