మిత్రుడు వేరే ఊరు వెళ్లాడంటే బాధపడతామా...? ఇదీ అంతే

శుక్రవారం, 17 జూన్ 2016 (21:40 IST)
అతను నాకు చాలా ఆప్తుడైన మిత్రుడు. అనుకోకుండా అతడు మరణించాడు. నేను ఊహించలేదు. ఎంత ప్రయత్నించినా మరచిపోలేకపోతున్నాను. ఏమిటీ జీవితం? ఏమిటీ జనన మరణాలు...?
 
భగవద్గీతలో కృష్ణ సందేశం: 
అతడు నావాడంటున్నావు. అందుకే నీకు అంత బాధ. ఈ లోకంలో ఎవరికీ ఎవరూ తనవారు కాదు. అలాగని పరాయివారూ కాదు. అదంతా మనం పెంచుకున్న అనుబంధం. అసలు మరణమంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? మనకు జీవితంలో ముందు బాల్యం వస్తుంది. కొన్నాళ్లకు అది గడిచి యౌవనం ప్రారంభమవుతుంది. నేను యువకుణ్ణి అనుకుంటుండగానే ముసలితనం వచ్చేస్తుంది. బాల్యం పోయిందని బాధపడుతున్నావా..? లేదు. అలాగే నీ ఆత్మ ఈ శరీరంలో కొన్నాళ్లుండి ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదీ శాశ్వతం కాదు. కొంతకాలం తర్వాత దాన్ని వదిలిపెడుతుంది. ఈ శరీరం నాది అనుకుంటాడు జీవుడు. అందుకే మరణమంటే భయం. చచ్చిపోయినాడంటే బాధ. మిత్రుడు వేరే ఊరు వెళ్లాడంటే బాధపడతామా...? ఇదీ అంతే. ఐతే బాధపడకుండా ఉండాలంటే ఆ దృష్టి కావాలి.

వెబ్దునియా పై చదవండి