మరణించిన తల్లి కలలో కనిపిస్తే, ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోమని.. అలాగే తోటివారితో జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. మనకు బాగా దగ్గరైన వారు కానీ చనిపోయిన వారు కానీ కలలో కనిపిస్తే.. కొన్ని ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
మనతోటి ఉన్నవారు మనం నుంచి దూరమయ్యాక మనకు ఏర్పడే కష్టనష్టాలను గురించి ముందుగా హెచ్చరించేందుకే కలలో వస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇంకా చనిపోయిన వ్యక్తులు మీకు కలలో కనిపిస్తున్నట్లయితే మీరు ఆనందాన్ని, జీవనాన్ని కోల్పోతున్నట్లు, సరైన ఆలోచనాధోరణిలా వెళ్ళకుండా, ఏదో కీడు మిమ్మల్ని శంకిస్తున్నట్లు అర్థమని సమాచారం. చనిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కలలో కనిపిస్తే ఎప్పుడూ ఆ బాధను దిగమింగుకోలేక.. ఎంతో వ్యధను దుఃఖాన్ని అనుభవిస్తున్నారని అర్థం చేసుకోవాలి.