గడప మీద కూర్చుంటున్నారా? నిల్చుంటున్నారా? అలా చేయకండి..

గురువారం, 2 మార్చి 2017 (12:56 IST)
గడప మీద నిల్చుంటున్నారా? అయితే ఇకపై అలా చేయకండి. గడపపై నిల్చోవడం.. కూర్చోవడం చేయకండి. గడప మీద తలగాని-కాళ్లుగాని పెట్టుకొని పడుకోకూడదు. గడపకు ఇవతల నిలబడి ఎవరికీ ఏమీ ఇవ్వకూడదని పండితులు అంటున్నారు. అలా చేస్తే సుఖశాంతులండవని అంటున్నారు. అష్టైశ్వర్యాలను ఒసగే లక్ష్మీదేవి గడప, తులసీలో కొలువుంటుందని.. అలాంటి గడపపై కూర్చోవడం.. నిల్చోవడం చేస్తే ఆమెను అవమానించినట్లవుతుందని వారు చెప్తున్నారు. 
 
అలాచేస్తే ఐశ్వర్యాలు చేజారి పోతాయని అంటున్నారు. అలాగే ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు.. గడపకు అవతల నుంచి ఇవతల వారికి ఇవ్వకూడదట. అలా ఇస్తే ఇంట సంపద మాయమవుతుందని.. ఇచ్చే దానం గడప దాటి.. బయటికి వచ్చి చేయాలని పండితులు అంటున్నారు. ఇంటి ముంగిటలో కంటికి ఇంపైన ముగ్గులు వేసుకోవాలి.. అప్పుడే లక్ష్మీ దేవి ఆ ఇంట నివాసం ఉంటుందని వారు చెప్తున్నారు. 
 
అలాగే సూర్యోదయం కాకుండానే నిద్ర లేవాలి. ఇక సూర్యాస్తమయం అయితేగాని నిద్రపోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఉత్తర ముఖంగా కూర్చొని భోజన చేయకూడదు. రాత్రిళ్లు చేప, కోడి, వగైరా తప్ప వేటమాంసం తినరాదు. శాకాహారం తీసుకోవడంతో పాటు మితంగా రాత్రిపూట తినడం ఆరోగ్యానికి మంచిది. 

వెబ్దునియా పై చదవండి