ప్రత్యేక దోష శక్తి కిరణాలు ఎలాంటివారిపై వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి?

బుధవారం, 25 మార్చి 2020 (23:29 IST)
నవగ్రహాల్లో ప్రతి ఒక్క గ్రహం నుండి అనుకూల మరియు వ్యతిరేకమనే రెండు రకాలైన శక్తి తరంగాలు ఒక కాంతి కిరణంలో ప్రయాణం చేసి ఈ భూమిని, దానిపై ఉన్న సమస్త జీవ, నిర్జీవ రాశులను చేరుతుండటం ప్రతీతి. 
 
పాజిటివ్ కిరణాలు శుభాన్ని, లాభాన్ని, మంచిని కల్గిస్తాయి. నెగటివ్ కిరణాలు కష్టాలను, బాధలను, దుఃఖాన్ని, నష్టాన్ని కల్గిస్తాయి. కాని శని గ్రహం మూడు ప్రత్యేక దోష శక్తి కిరణాలను ప్రసరింపచేస్తాడు. ఈ దోష కిరణాల ప్రభావం పొందిన రాశివారు తీవ్రమైన నష్టాన్ని, బాధలను, కష్టాల్ని పొందుతారన్నది విశ్వాసం. 
 
ఆ మూడు రకాల దోషాలు ఎలా వుంటాయంటే...
1. ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని దోషం
2. రెండున్నర సంవత్సరాలు అష్టమ శని దోషం
3. రెండున్నర సంవత్సరాలు అర్ధ అష్టమ శని దోషం
 
ఆయా దోషాలు పొందినవారు ఆయా దోష నివారణ చేయించుకున్నట్లయితే నెగటివ్ శక్తి తగ్గును. జాతకం ప్రకారం శనిదోషం ప్రకారం పండితుల సలహా మేరకు నివారణ చేయవచ్చు. లేదంటే ప్రతి శనివారం నువ్వులతో దీపమెలిగించినట్లైతే శనిగ్రహ దోషాలచే ఏర్పడే కష్టాలు, నష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు