తెలియక రావిచెట్టును నిత్యం తాకుతూ, పూజిస్తుంటే? అయితే అదృష్టం దూరమై, దరిద్రం పట్టినట్లే. లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలను కలుగజేస్తుంది అని మన అందరికీ తెలుసు. అయితే లక్ష్మిదేవి అక్క జ్యేష్ట లక్ష్మి దారిద్ర్య లక్ష్మి. పాల సముద్రం నుండి వచ్చినప్పుడు శ్రీ మహా విష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ, లక్ష్మీదేవి.... స్వామి నాకన్నా పెద్దది అక్క జ్యేష్ట లక్ష్మికి పెళ్లి కాకుండా నేను ఎలా చేసుకోను అని ప్రశ్నించింది.
విష్ణుమూర్తి తన భక్తుడైన ఒక మునికి ఇచ్చి పెళ్లి చెయ్యగా జ్యేష్ట లక్ష్మి అతనితో కాపురానికి వెళ్తుంది. అయితే ముని మహర్షి చాలా శుభ్రంగా ఉండటం, నిత్యం హోమ గుండం, మంత్ర జపం ఆమెకు నచ్చేది కాదు, అందుకే నన్ను వేరే చోట దింపితే నేను అక్కడే ఉంటాను అని జ్యేష్టా దేవి కోరింది. దీనితో ఆమెను రావి చెట్టు మొదలులో వదిలి ముని వెళ్లిపోతాడు.
అప్పుడు విష్ణుమూర్తిని ప్రాధేయపడగా, అక్కడే నివాసం ఉండమని చెప్తాడు. అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టుని ముట్టుకుంటే దరిద్రాలు వస్తాయి. కేవలం శనివారం లేదా ఆదివారం మాత్రమే రావిచెట్టుని తాకితే అదృష్టం... శుభం... లాభం.