ఆపరేషన్ సిందూర్ 2.0 జరిగితే ప్రపంచపటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తామని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టి హెచ్చరికలు చేశారు. సీమాంతర ఉగ్రవాన్ని అరికట్టకపోతే పాకిస్థాన్‌ను ప్రపంచ చిత్రపటంలోనే లేకుండా చేస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. దేవుడు అనుమతి ఉంటే అలాంటి అవకాశం త్వరలోనే లభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని అనప్‌గఢ్‌లో ఉన్న ఆర్మీ పోస్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈసారి తాము గతంలోలా సంయమనం పాటించబోమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ 1.0లో ఉన్నట్టుగాకాకుండా, ఆపరేషన్ సిందూర్ 2.0లో పాకిస్థాన్ మరింత తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.