జయ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే...?

మంగళవారం, 31 జనవరి 2023 (22:32 IST)
జయ ఏకాదశి రోజున ఉపవాసం పుణ్యఫలాలను ఇస్తుంది. ఈ ఉపవాసం వుండే భక్తులు ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజున తప్పనిసరిగా సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. 
 
ఏకాదశి రోజున తెల్లవారుజామున స్నానం చేసిన విష్ణువుకు నిష్ఠతో పూజలు చేయాలి. ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి. అలాగే  పన్నెండవ రోజు (ద్వాదశి) పేద వ్యక్తికి లేదా బ్రాహ్మణుడికి ఆహారం ఇవ్వాలి. దానధర్మాలు చేసి ఉపవాసాన్ని విరమించాలి. 
 
మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో, ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి. 
 
భీష్మ ఏకాదశి రోజున భీష్ములకు తర్పణం చేసి, శ్రీమహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు