ముత్యాలు విలువైనవి. చల్లదనాన్ని ప్రసాదిస్తాయి. అంతటి ప్రాశస్త్యమైన ముత్యాలను పందిరిగా చేసుకున్న వాహనంలో మలయప్ప స్వామి చూడముచ్చటగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పందిరిలో శ్రీవారిని దర్శించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఇక సోమవారం ఉదయం శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు సింహం సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహదర్శనం అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతువుతారు.