చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

ఐవీఆర్

ఆదివారం, 24 నవంబరు 2024 (21:30 IST)
చెప్పులున్నవాడి వెనుక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగవద్దు అనేది పెద్దల సామెత. ఇలా ఎందుకు అన్నారంటే.. చెప్పులు వేసుకుని వెళ్లేవాడు ఎలాబడితే అలా నడుస్తాడు. అతను నడిచే బాటలో ముళ్లున్నా, రాళ్లున్నా తను చెప్పులు వేసుకున్నాడు కనుక ఎలాంటి భయం లేకుండా వెళ్తుంటాడు. ఐతే చెప్పులు వేసుకున్నవాడి వెనుక చెప్పులు వేసుకోకుండా నడిస్తే... అతడికి ముళ్లూ, రాళ్లూ గుచ్చుకోవచ్చు. గాయాలు కావచ్చు. అందుకే చెప్పులున్నవాడి వెనుక నడవద్దనేవారు.
 
ఇక అప్పులున్నవాడి వెనక నడిస్తే.. అతడి నుంచి అప్పులు తీసుకున్న వ్యక్తి అప్పు గురించి రోడ్డుపై నిలదీస్తే.. పక్కనే వున్న వ్యక్తికి జాలి అనిపించవచ్చు. తీరుస్తాడులేవయ్యా అని అనవచ్చు. దాంతో అప్పు ఇచ్చిన వ్యక్తి... మీకంత జాలిగా వుంటే ఆ అప్పు మీరు తీర్చవచ్చు కదా అని అడగవచ్చు. అలా మీరు అనుకోకుండానే అప్పుల్లో కూరుకుపోవచ్చు అంటూ గరికపాటివారు తన ప్రవచనాల్లో చెప్పారు.
 

చెప్పులున్న వాడి వెనక అప్పులున్న వాడి వెనక వెళ్లకండి..!!pic.twitter.com/tUHURLthPL

— కన్నేపల్లి సరసస్వరTextrovert (@Ksravishankar2) November 24, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు