శ్రీమహాలక్ష్మి దరిద్రుడిని ధనవంతుడిగా చేస్తుంది. ఈ ధనంతో వాడి జాతకం తిరుగుతుంది. రోగిని ఆరోగ్యవంతుడిని చేస్తుంది. పిసినారి వాడిని గొప్ప దాతగా చేస్తుంది.
చెడు ప్రవర్తన కలవాడిని సన్మార్గుడిగా చేస్తుంది. వికారంగా వుండేవాడిని అందగాడిగా చేస్తుంది. బలహీనుణ్ణి బలవంతుడిగా చేస్తుంది. తెలివితక్కువ వాడిని మహా పాండిత్యవంతుడిగా మారుస్తుంది.
పాపాత్ముడిని పుణ్యాత్ముడిగా చేస్తుంది. ఆయుర్దాయం లేనివాణ్ణి ఎంతోకాలం జీవించేవాడిగా చేస్తుంది. మహా కోపిని పరమ శాంతుడిగా చేస్తుంది. సిరిసంపదలున్నవాడికే అన్ని కోరికలూ తీరుతాయి. కనుక శ్రీమహాలక్ష్మని ప్రసన్నం చేసుకునేందుకు ఆ మాతను నిత్యం ప్రార్థించాలి.