షిర్డీ సాయికి కుటుంబ సపరివారంగా అభిషేకం చేయించుకుంటారు. అభిషేకానికి టిక్కెట్ చూపిస్తే పూజారి... ఒక కొబ్బరి కాయ, పసుపు, కుంకుమ, పూలు ఇస్తాడు. అభిషేకం అంతా మనం చేసుకునే తరహాలోనే సాగుతుంది. కాకపోతే మరాఠీ భాషతో సంస్కృతం కలిపి మంత్రాలు చదివుతారు. 45 నిముషాలపాటు సాగుతుంది. అభిషేకం ముగిశాక పూజారి ఇచ్చే కొబ్బరికాయను ఇంటికి వెళ్ళాక ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటిపైన కిటికీకి కడితే శుభం జరుగుతుందని నమ్మకం. అందుకే దాన్ని జాగ్రత్తగా తీసుకువెళతారు. ఇక ప్రసాదాల్లో పాలకోవా అక్కడ స్పెషల్.
ఇకపోతే సాయిబాబా ఆలయం ఎలా వుందంటే?
1. సమాధి మందిరం.. అంటే షిర్డీ దర్శనం.
2. చావడి.. ఇక్కడే బాబా విశ్రాంతి తీసుకునేవారట.
1. ముక్తిదామ్. బిర్లామందిరం.. సర్వ దేవతా విగ్రహాలు ఉంటాయి.
2. త్రయంబకేశ్వరం.. 10వ జ్యోతిర్లింగం. గోదావరి పుట్టుక ఇక్కడే.
3. పంచవటి... రామాయణంలో చెప్పబడిన ప్రాంతం.
4. ఎల్లోరా గుహలు... ఇవన్నీ.. చూడాలంటే.. తీరిక చూసుకుని వస్తే...వాటిని ఆస్వాదించవచ్చు.