విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే వాటిపై అలాంటి ఫలితాలు...
బుధవారం, 16 జనవరి 2019 (21:15 IST)
మానవులు తమకున్న కష్టాల నుండి కాపాడమని భగవంతునుని అనేక రకాలుగా ప్రార్ధిస్తుంటారు. ఆ ప్రార్ధనలో భాగంగా వారు రకరకాల పూజలు, వ్రతాలు, పారాయణలు చేస్తుంటారు. వాటన్నింటిలోకెల్లా విష్ణుసహస్రనామ పారాయణ ఎంతో విశిష్టమైనది. విష్ణుసహస్రనామ పారాయణ విలువ తెలిస్తే అది చేసే మేలు అంతా ఇంతా కాదు అని శిరిడీ సాయిబాబాఅంతటివారు కూడా ఒక సందర్భంలో విష్ణుసహస్రనామ పుస్తకాన్ని తన హృదయానికత్తుకొని .. ఈ స్తోత్రం ఎన్నో సార్లు నన్ను ఎన్నో సమస్యలనుండి కాపాడింది. మీరంతా నిత్యం పఠించమని శ్యామాతో పలికారు.
ఈ దైనందిన జీవితంలో సామాన్య మానవుల సకల సమస్యలకు పరిష్కారమేంటీ అని అడిగిన ధర్మరాజుకు భీష్మపితామహులు మానవజాతికి ఉపదేశించిన స్తోత్రమే శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రము. శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రంలో మెుత్తం 108 శ్లోకాలు ఉంటాయి. సహస్రం అంటే వెయ్యి అని అర్ధం. వెయ్యి నామాలన్నీ కూడా శ్రీమన్నారాయణుని స్తుతించే నామాలే. అత్యంత శక్తి వంతమైన శ్లోకాలు అవి. ఒక్కో శ్లోకంలోఒక్కో సందర్బానికి తగినట్లుగా ఒక్కో సమస్యను పరిష్కరించే శక్తి దాగి ఉంది.ధనాభివృద్ధికి, మంచి ఆరోగ్యానికి, విద్యాభివృద్ధికి, మనశ్శాంతికి ఈ విష్ణుసహస్రనామ పారాయణ ఎంతో మేలు చేస్తుంది. నిత్య జీవితంలో మానవులు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఎవకి కోరికను అనుసరించి వారు ఈ పారాయణను చేయవచ్చు.