ఓర్పు లేని మనిషి నూనెలేని దీపం వంటివాడు...

బుధవారం, 30 జనవరి 2019 (21:35 IST)
1. అదృష్టం మనం చేసే కృషిలోనే ఉంటుంది.
 
2. అనుభవం వల్ల వచ్చే జ్ఞానమే అసలైన జ్ఞానం.
 
3. మంచి ఆరోగ్య భాగ్యమే బంగారాన్ని మించిన మహద్భాగ్యం.
 
4. ఇంగితజ్ఞానంతో కూడిన ధైర్యమే సద్గుణమనిపించుకుంటుంది.
 
5. ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలుడైన వ్యక్తి మేలు.
 
6. ఎప్పుడూ శాంతంగా, ప్రసన్నంగా ఉండటమే గొప్ప లక్షణం.
 
7. ఎప్పుడూ ఒకరికివ్వడం నేర్చుకో.. తీసుకోవడం కాదు.
 
8. ఒక సమర్ధుడి వెనుక చాలామంది సమర్ధత దాగి ఉంటుంది.
 
9. ఓర్పు లేని మనిషి నూనెలేని దీపం వంటివాడు.
 
10. మోసం చేయడం కంటే ఓటమి పొందడమే గౌరవదాయకమైన విషయం

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు