డబ్బు చాలా శక్తివంతమైనది. ఎక్కడ ధనముంటే అక్కడ సౌఖ్యాలు, సౌభాగ్యాలు, వసతులు అన్నీ ఉంటాయి. కానీ ప్రస్తుత సమాజంలో ధనం కోసం కొన్ని మోసాలు, ఇతరులను బాధపెట్టడం, మోసగించడం, ఇతరుల సొమ్ముకు ఆశపడటం ఇలాంటివి అన్నీ కూడా జరుగుతున్నాయి. ధర్మబద్ధంగా మనం సంపాదించే ధనాన్ని అదేవిధంగా పొదుపు చేసుకోవాలి.
ఆర్థిక అవసరాలు, జీవితం ముందుకు సాగాలంటే, ఒకరి దగ్గర మనం అవమానాలకు గురి కాకుండా ఉండాలంటే మన దగ్గర ధనం ఉండాలి. ధనం ఉండాలి కదా అని చెప్పి ఎలా పడితే అలా సంపాదిస్తే ధనం నిలబడదు. కాబట్టి ధనం నిలబడాలి అంటే ధర్మపరంగా, న్యాయంగా సంపాదించాలి. మోసం అసలు చేయకూడదు. అక్రమ మార్గంలో సంపాదించకూడదు.