వృక్షములో రావిచెట్టు దేవతా వృక్షంగా చెప్పబడుతోంది. రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపమని అంటారు. త్రిమూర్తి స్వరూపంగా కూడా భావించి పూజిస్తుంటారు. అందుకే రావిచెట్టును చూడగానే పవిత్రమైన భావన కలుగుతుంది. విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఆకులతో గలగలమంటూ అదిచేసే ధ్వని మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.