సుప్రసిద్ధ ఆలయాల్లో మహిళలు, పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించాలనే నియమం వుంటుంది. కానీ ఆ ఆలయంలోకి పురుషులు ఆడవారిలా తయారయ్యాకే అడుగు పెట్టాలనే నియమం వుంది. లిప్ స్టిక్, పువ్వులు పెట్టుకుంటేనే ఆ దేవాలయంలోకి పురుషులను అనుమతిస్తారు. ఆ ఆలయం కేరళలోని కొల్లం జిల్లాలో వుంది. ఈ దేవాలయం పేరు కొట్టాన్ కొల్లారా ఆలయం.
చాలాకాలం పాటు ఈ ఆలయంలో ఈ ఆచారం వుంది. ఈ ఆలయంలోకి పురుషులకు అనుమతి ఇవ్వరు. కానీ ఈ దేవాలయంలోకి వెళ్లాలనుకున్న పురుషులు అచ్చం మహిళల్లో చీర కట్టుకుని ముస్తాబు కావాల్సి వుంటుంది. కంటికి కాటుక, పెదవులకు లిప్ స్టిక్, పువ్వులు పెట్టుకుని రావాలి. స్త్రీల తరహాలో పురుషులు అలంకరించుకునేందుకు ఆలయ పరిసరాల్లో తగినన్నీ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆరోగ్యం, వివాహం, విద్య, ఉద్యోగం వంటి అంశాలపై మొక్కుకున్న వారు అమ్మవారిని వేడుకుంటారు. ఆ ఆచారం వెనుక వున్న ఎన్నో కథలున్నాయి. ఓసారి పశువుల కాపరులు చీరలు ధరించి దగ్గరిలోని ఓ రాయికి పూజలు చేస్తే.. ఆ రాయిలో దైవశక్తిని గమనించారు. తర్వాతి కాలంలో ఆ రాయిని కొట్టన్ అని పిలిచి దాని చుట్టూ గుడి కట్టారు.