ఏపీలో పలు ఆలయాల్లో అన్నదానం నిలిపివేత

సోమవారం, 22 మార్చి 2021 (19:40 IST)
విజయవాడ: రాష్ర్టంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రముఖ దేవాలయాల్లో అన్నదానం నిలిపివేస్తున్నట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ తెలిపింది. నిన్నటి వరకు పలు ఆలయాల్లో జరిగిన అన్నదానం కరోనా విజృంభణ కారణంగా ఆగిపోనుంది.

ద్వారకా తిరుమల, విజయవాడ ఇంద్రకీలాద్రి, పలు ఆలయాల్లోనూ అన్నదానం నిలిపివేయాలని దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశించింది. కాగా అన్నదానం ఆగిపోయిన భక్తులకు భోజనాన్ని అందించేందుకు దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది.

ఈరోజు నుంచి భక్తులకు పలు ఆలయాల్లో ప్యాకెట్లలో భోజనం అందించనున్నారు. భోజనం ప్యాకెట్లలో సాంబారు అన్నం, దద్దోజనం ఇస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు భోజనాన్ని ప్యాకెట్లలో పంపిణీ చేస్తామని దేవాదాయ ధర్మదాయ శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు