ఇంద్రియ నిగ్రహాన్ని, అంతేగాక క్లిష్ట పరిస్థితుల్లో భయంకర రోగాలు ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ తొలి ఏకాదశికి పేలాల పిండిని తినే ఆచారం ఉంది. పేలాలలో బెల్లం, యాలకులను చేర్చి ఈ పిండిని తయారుచేస్తారు.
పేలాలు జొన్నల నుంచి తయారుచేస్తారు. జొన్నలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనలోని రోగాలు తగ్గించడానికి ఇమ్యునిటీ పవర్‌ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి పేలాల పండుగగా పిలువబడే తొలి ఏకాదశినాడు అటు ఆధ్యాత్మికపరంగా, ఇటు సైన్స్ పరంగా కూడా గొప్ప విలువను సంతరించుకున్న పేలాలను ప్రతి ఒక్కరు తినాలట.