ఫిబ్రవరి 12న తిరుమలలో నెలవారీ పౌర్ణమి గరుడసేవ జరుగుతుంది. ఈ సందర్భంగా, శ్రీ మలయప్ప స్వామి సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం వాహన సేవను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఇక, ఆదివారం శ్రీవారిని 84,536 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మొత్తం 25,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.