అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుపతి లక్కీ ఫర్ యు ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన శ్రీ సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు సోమవారం టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 10 వేల 116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుపతి లో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఈవో, అదనపు ఈవో అభినందించారు.