తిరుమల: కృష్ణా పుష్కర సంరంభానికి తిరుమలేశుడు తరలివస్తున్నాడు. పుష్కర యాత్రికులకు దీవెనలు అందించడానికి శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వరుడు బెజవాడకు బయలుదేరాడు. తిరుమల తిరుపతి నుంచి స్వామివారి పుష్కర కల్యాణ రథం బయలుదేరింది.
ఈ రథాన్ని లాంఛనంగా టీటీడీ ఇవో చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు. టీటీడీ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, కల్యాణ రథాన్ని సాగనంపారు. ఈ నెల 5 సాయంత్రానికి స్వామివారి రథం విజయవాడ చేరుకొంటుంది.