కవిత్రయం రచించిన అంధ్ర మహాభారతంలోని పద్యాలు బాల బాలికలు, యువతీ యువకులు పఠించడం ఎంతో అవసరమని, దీనివల్ల తెలుగు భాషా వైభవం, భక్తితత్వం, అత్యంత సుందరమైన భావవ్యక్తీకరణ వారికి అర్థమవుతాయని శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఈ సందర్భంగా అన్నారు.
శ్రీ కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి జన్మదిన సందర్భంగా 20 డిసెంబర్ 2022 రోజున కొవ్వూరు సంస్కృత విద్యా పీఠం వేదికగా వేలాదిమంది బాల బాలికలచే ఈ 108 పద్యాలను వివిధ ప్రాంతాల నుండి ఒకే సమయంలో సామూహికంగా గానం చేయించే ప్రయత్నం కంచి కామాక్షి పీఠం చేపట్టునున్నదని నిర్వాహకులు తెలిపారు.
ఈ 108 పద్యాలను అందరూ సులువుగా పాడుకునే విధంగా గానం చేసి ధ్వని ముద్రితం చేసిన సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు, ప్రముఖ గాయకులు డా.గజల్ శ్రీనివాస్‌ను శ్రీ కంచి శంకర విజయేంద్ర స్వామి అభినందించి తీర్థ ప్రసాదాలను అందినట్టు గజల్ శ్రీనివాస్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.