తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనె 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం, రాత్రి వేళల్లో స్వామివారు వాహనసేవలు కొనసాగునుంది.
19వ తేదీ గురువారం ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేషవాహనం, 20వ తేదీ ఉదయం చిన్నశేషవాహనం, రాత్రి హంసవాహనం, 21వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 22వ తేదీ ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 23వ తేదీ ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడవాహనం, 24వ తేదీ ఉదయం హనుమంతవాహనం, రాత్రి గజవాహనం, 25వ తేదీ ఉదయం సూర్యప్రభవాహనం, రాత్రి చంద్రప్రభవాహనం, 26వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 27వ తేదీ చక్రస్నానం లు జరుగనున్నాయి.