Shravana Masam 2025: శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?

సెల్వి

శుక్రవారం, 25 జులై 2025 (11:23 IST)
Sravana Masam
శ్రావణమాసం జూలై 25వ తేదీ నుంచి ప్రారంభం అయ్యింది. ఆగష్టు 23వ తేదీతో శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ శ్రావణంలో వున్న పండుగల గురించి తెలుసుకుందాం. ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది నాగ పంచమి జూలై 29 మంగళవారం జరుపుకోనున్నారు. 
 
పుట్టలో పాలు పోసి నాగులను పుజిస్తారు. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొస్తుందంటే.. వరలక్ష్మి వ్రతం పున్నమికి మందు వచ్చే శుక్రవారం మరింత ఫలవంతం అని భావిస్తారు. ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం శుక్రవారం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. ఆగస్టు 1,15, 22 తేదీల్లో కూడా వరలక్ష్మీవ్రతం జరుపుకోవచ్చు. 
 
అలాగే ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మీ వ్రతానికి తోడు వారాహి జయంతి కూడా వస్తోంది. ఇక ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వస్తోంది. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున జంధ్యాన్ని మార్చుకునే సంప్రదాయం కూడా ఉంది.  శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు జన్మించిన తిథిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నారు. 
 
శ్రీ కృష్ణుడు అంశ బలరాముడు జన్మదినోత్సవాన్ని ఈ ఏడాది ఆగష్టు 14వ తేదీన వస్తోంది. శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య తిథి. దీనినే పోలాల అమావాస్యగా జరుపుకుంటారు.
 
శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?
జూలై 25: మొదటి శ్రావణ శుక్రవారం
జూలై 29: మొదటి శ్రావణ మంగళవారం, నాగ పంచమి పండగ
ఆగష్టు 01 : రెండో శ్రావణ శుక్రవారం
ఆగష్టు 05 : శ్రావణ మంగళవారం
ఆగష్టు 08 : మూడో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, వారాహి జయంతి,
ఆగష్టు 09 : రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి
ఆగష్టు 12 : మూడో శ్రావణ మంగళవారం
ఆగష్టు 14: బలరామ జుయంతి
ఆగష్టు 15 : నాలుగో శ్రావణ శుక్రవారం
ఆగష్టు 16: కృష్ణాష్ణమి
ఆగష్టు 19 : నాలుగో శ్రావణ మంగళవారం
ఆగష్టు 22: ఆఖరి శ్రావణ శుక్రవారం
ఆగష్టు 23 : శనివారం పోలాల అమావాస్య

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు