ప్రపంచాన్ని కరోనా నుంచి రక్షించేందుకు ప్రముఖ పండితుల సూచనల మేరకు జూన్ 11వ తేదీ నుంచి సుందరకాండ పారాయణం ప్రారంభించామన్నారు. ఇందులోని శ్లోకాలను భక్తులతో పలికించి అర్థతాత్పర్యాలతో పాటు ఆ శ్లోక ఉచ్చరణ వల్ల కలిగే ఫలితం, నేటి ఆధునిక సమాజంలోని మానవాళికి ఏ విధమైన సందేశం ఇస్తుందో వివరిస్తూ ప్రతిరోజూ 10 శ్లోకాలను నిరంతరాయంగా పఠించామన్నారు.
అఖండ పారాయణంలో 108 మంది వేదపండితులు, ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద అధ్యయన సంస్థకు చెందిన వేద విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నట్లు అదనపు ఈఓ చెప్పారు.