26 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

సోమవారం, 17 అక్టోబరు 2016 (10:59 IST)
కలియుగ వైకుంఠుని పట్టపురాణి తిరుమల వెంకన్న సతీమణి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు తితిదే ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముగిసి కొన్ని రోజులు కాకముందే అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో భక్తుల్లో ఆధ్మాత్మిక భావన వెల్లివిరిస్తోంది.
 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్‌ 26వ తేదీన ధ్వజారోహణం, రాత్ర చిన్నశేషవాహనం, 27వతేదీ ఉదయం పెద్దశేషవాహనం, రాత్రి హంసవాహనం, 28వతేదీ ఉదయం ముత్యపుపందిరి వామనం, రాత్రి సింహవాహనం, 29వతేదీ ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి హనుమంతవాహనం, 30వతేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజవాహనం, డిసెంబర్‌ 1వతేదీ ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి గరుడవాహనం, 2వతేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభవాహనం, 3వతేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 4వతేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, పంచమీతీర్థంలు జరుగనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి