శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల డబ్బు వాపస్?! .. తితిదే కీలక నిర్ణయం
గురువారం, 16 ఏప్రియల్ 2020 (16:43 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొనివుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 11 జిల్లాలను కేంద్రం హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం లాక్‌డౌన్ వచ్చే నెల మూడో తేదీ వరకు అమల్లో వుండనుంది. దీంతో వచ్చే నెల మూడో తేదీ వరకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మే 31వ తేదీ వరకు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు తెలిపింది.
ఈ సేవల కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తులు... వారి టికెట్ వివరాలను, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను పపించారని కోరింది. ఈ వివరాలను [email protected]కి వివరాలను పంపాలని టీటీడీ అధికారులు గురువారం విజ్ఞప్తి చేశారు.