కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వసంతోత్సవాలు

మంగళవారం, 12 మే 2020 (21:54 IST)
శ్రీనివాసమంగాపరంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మంగళవారం రెండోరోజుకు చేరుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
 
వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆలయ ముఖమండపంలో శ్రీ శ్రీనివాస సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తెనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
 
ఎప్పుడూ భక్తజనసంద్రం మధ్య గోవిందనామస్మరణల మధ్య వసంతోత్సవాలను టిటిడి నిర్వహించేది. కానీ మొట్టమొదటిసారి టిటిడి చరిత్రలో వసంతోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. రేపటి వరకు వసంతోత్సవాలు జరుగనున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు