ప్రేమ గురించి చాలామంది చాలాసార్లు చెప్పినా అది ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. అందుకే ఇద్దరి హృదయాల్లో చిగురించే ప్రేమ ఇలా ఉంటుందని ఎంతమంది ఉదాహరణలు చెప్పినా మరో కొత్త కోణంలో, మరో కొత్త మార్గంలో ప్రేమ జనిస్తూ ఉంటుంది.
అయితే ప్రేమ జనించడానికి కారణం ఏదైనా, మార్గం ఏదైనా ఆ ప్రేమను ఓ మానసిక బంధంగా ప్రేమికులు మార్చుకోగల్గితేనే అది జీవనబంధం అవుతుంది. అలాంటి బంధమే జీవితం చివరివరకు కొనసాగగలుగుతుంది. ముందుగా చెప్పుకున్నట్టు ప్రేమ ఎన్ని మార్గాల్లో జనించినా అందులో ఆకర్షణ అనే కారణం ప్రధానమైందని అందరూ ఒప్పుకునేదే.
భౌతికశాస్త్రవేత్తలు చెప్పినట్టు ఈ విశ్వంలో ఏ పదార్థం కూడా శూన్యంలోంచి కొత్తగా పుట్టుకురాదు. కొత్తగా పుట్టిన ప్రతీది అంతకు ముందు మరో రూపంలో ఈ విశ్వంలో ఖచ్చితంగా ఉండి ఉంటుంది.
ఒకరిని చూచినపుడు ఎదో తెలియని ఆకర్షణ మనల్ని వారివైపు నుంచి దృష్టి మరల్చనీయకుండా చేయవచ్చు. అలా మనల్ని దృష్టి మరల్చనీయకుండా చేసిన అంశం ఏదా అంటూ ఆలోచిస్తే అది ఏదైనా కావచ్చు. ఆకర్షించే రూపం, ఎదుటివారిలోని చలాకీతనం, చూపుల్లోనే భావాలు తెలిపే చక్కని కళ్లు, ముద్దెట్టుకోవాలనిపించే నునులేత చెక్కిళ్లు, అలా చూస్తూ ఉండాలనిపించే చక్కని సౌష్టవం.... ఇలా ఎదుటివారిలో ఆకర్షించే అంశం ఏదైనా కావచ్చు. ఆ అంశం మనకు ఎదుటివారిపై ప్రేమ ఏర్పడేలా చేయవచ్చు.
తరచి చూస్తే ఎదుటివారిపై ప్రేమ అనే భావం మనలో కలగడానికి కూడా ఓ కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం కూడా. భౌతికశాస్త్రవేత్తలు చెప్పినట్టు ఈ విశ్వంలో ఏ పదార్థం కూడా శూన్యంలోంచి కొత్తగా పుట్టుకురాదు. కొత్తగా పుట్టిన ప్రతీది అంతకు ముందు మరో రూపంలో ఈ విశ్వంలో ఖచ్చితంగా ఉండి ఉంటుంది.
అయితే కొన్ని సార్లు కొత్త పదార్థం తయారీకి కారణభూతమైన పూర్వ పదార్థం ఏది అనే విషయం మనకు తెలియకపోవచ్చు. ఇప్పటివరకు చెప్పిన ఈ శాస్త్ర సత్యం ప్రేమ విషయంలోనూ వర్తిస్తుంది. మనసు అంతరాల్లో ఏమూలో మనకు నచ్చిన అంశం ఎదుటివారిలో కన్పించినపుడు ఒక్కసారిగా మన హృదయం స్పందించడం ప్రారంభిస్తుంది.
అలా ఒకర్ని చూచినపుడు ప్రారంభమైన హృదయస్పందన వారు కన్పించిన ప్రతిసారీ మనలో కన్పించగల్గితే, అలాగే ప్రతిసారీ ఆ స్పందన తీవ్రత ఎక్కువైతే అదే చివరకు ప్రేమగా మారుతుంది. అయితే మనలో ప్రేమ కల్గడానికి ఆకర్షణ అనే అంశం ఓ కారణమైనా ప్రేమబంధం బలపడడానికి మాత్రం అది సరిపోదు.
మనకు నచ్చిన వ్యక్తిని మన మనసు కూడా ఇష్టపడడం అనే ప్రక్రియ ప్రేమికులిద్దర్లోనూ జరిగితే ?... ఇక వారి ప్రేమబంధం ఎంతటి అపురూప బంధంగా మారుతుందో మనం ఊహించుకోవచ్చు.
అంతకుమించిన మరో బంధమేదో ప్రేమికుల మధ్య చోటు చేసుకుంటేనే ఆ ప్రేమ నిజమైనదవుతుంది. అలాంటి బంధం ఏదంటే అది మానసిక బంధం అని చెప్పవచ్చు. అందరూ చెప్తుంటారు నేను నా మనసు చెప్పినట్టే చేస్తుంటాను... అంటే ప్రతి మనిషి తన మనసు చెప్పినట్టు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది ఇక్కడ సుస్పష్టం.
మనిషిగా ఆకర్షింపబడి మనకు నచ్చిన మనిషి మన మనసుకు కూడా నచ్చితే ? ఆ మనిషికి మనం జీవితంలో ఎంత ప్రాధాన్యం ఇస్తాం అనే విషయం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. అదేసమయంలో ఇలా మనకు నచ్చిన వ్యక్తిని మన మనసు కూడా ఇష్టపడడం అనే ప్రక్రియ ప్రేమికులిద్దర్లోనూ జరిగితే ?... ఇక వారి ప్రేమబంధం ఎంతటి అపురూప బంధంగా మారుతుందో మనం ఊహించుకోవచ్చు.
అలా ఆకర్షణతో మొదలైన ప్రేమబంధం మానసిక బంధంగా పరిణితి సాధిస్తే ఆ ప్రేమికుల జీవితం కవులు కావ్యాల్లో చెప్పినట్టు, ప్రతి ఒక్కరు కలల్లో ఊహించినట్టు నిజంగానే అద్భుతంగా కొనసాగుతుంది.