ప్రేమంటే శారీరక అవసరమా... ?

Munibabu

గురువారం, 18 సెప్టెంబరు 2008 (18:56 IST)
ఓ ఆడా, మగా మధ్య పుట్టే ప్రేమ ఆకర్షణ నుంచి జనిస్తుంది అంటారు. నిజమే... విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి అనే శాస్త్రీయ సిద్ధాంతంలా ఆడ, మగ మధ్య పుట్టే ప్రేమకు బలం ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రేమ బంధం కోసం మనిషి తన ఇతర బంధాలను త్యాగం చేయడానికి సైతం వెనకాడడు.

మిగతా బంధాల్లో లేనిది ప్రేమలో మాత్రమే ఉన్నది అదే మరి. మిగతా బంధాల మధ్య ఎక్కడో, ఏదో సమయంలో ఓ హద్దు అనేది ఉంటుంది. కానీ ప్రేమ బంధం అలా కాదు. చూపులతో ప్రారంభమై తనువులు పెనవేసుకుని ఆపై శరీరాలు సైతం ఏకం అయ్యే ఓ అపురూపమైన బంధమే ప్రేమంటే.
  ఓ ఆడా, మగా మధ్య ప్రేమ బంధం ఏర్పడి అది బలీయమై దాంపత్య బంధంగా మారినపుడు ఇక ఆ జంట మధ్య ఏర్పడే ఏ బంధమైనా వారిద్దరూ శాశ్వతంగా కలిసి ఉండేందుకే సహకరిస్తుంది.      


అందుకే అడా, మగా మధ్య జనించే ప్రేమ కూడా ఓ రకంగా శరీరాల అవసరం నుంచి పుట్టేదే అంటూ కొందరు చెబుతుంటారు. ప్రేమ జీవిత బంధంగా మారినపుడు శరీరాల కలయిక అనేది కూడా అందులో భాగంగానే ఉంటుంది. అలా ఉండాలి కూడా. అలా ఉన్నప్పుడే ఆ ప్రేమికుల బంధం మరింత బలీయమై జీవితాంతం విడిపోని బంధంగా మారుతుంది.

అయితే కేవలం శరీరాల అవసరం కోసమే ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ జనిస్తే ఆ ప్రేమ ఎంతో కాలం నిలబడే అవకాశం లేదు. అది కాస్తా తీరాక వారి ప్రేమ సైతం ఆవిరైపోతుంది. శరీరాల అవసరం కోసమే ప్రేమ జనించేది నిజమైతే మానవ పరిణామ క్రమంలో ప్రేమకు ఇంతటి ప్రాశస్త్యం, గొప్పతనం ఉండేది కాదు.


ముందుగా చెప్పినట్టు శారీరక అవసరం సైతం ప్రేమలో భాగమైనా కేవలం అందుకోసమే ప్రేమ జనిస్తుందనుకోవడం పొరబాటు. అసలు నిజమైన ప్రేమంటే... శరీరాల బంధం కాదు. అది రెండు మనసుల బంధం. అప్పటివరకు కనీస పరిచయం కూడా లేని ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్నో జన్మలుగా బంధం ఉన్నట్టు అనిపించి ఆ బంధాన్ని మళ్లీ తామిప్పుడు కొనసాగించాలంటూ బలంగా విశ్వసించే ఓ అనిర్వచనీయమైన అనుభూతే ప్రేమంటే.

అలాంటి అనుభూతి ఇద్దరి మనసుల్లోనూ కలిగినపుడే వారి మధ్య జనించిన ప్రేమకు నిజమైన సార్థకత ఏర్పడుతుంది. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ బంధం భవిష్యత్‌లో మరింత బలపడి దాంపత్య బంధానికి దారితీస్తుంది. ఇలా ఓ ఆడా, మగా మధ్య ప్రేమ బంధం ఏర్పడి అది బలీయమై దాంపత్య బంధంగా మారినపుడు ఇక ఆ జంట మధ్య ఏర్పడే ఏ బంధమైనా వారిద్దరూ శాశ్వతంగా కలిసి ఉండేందుకే సహకరిస్తుంది.
  సామాజిక విలువలకు కట్టుబడి మనస్ఫూర్తిగా ప్రేమ బంధాన్ని కొనసాగించగల్గినపుడు మిగిలిన అన్ని బంధాలకు లాగానే ప్రేమ బంధానికి సైతం అందరిలో గుర్తింపు, గౌరవం లభిస్తుందనే విషయాన్ని ప్రేమికులు సైతం గుర్తించగల్గితే... మేము ప్రేమిస్తున్నాం అని చెప్పడానికి ఏమాత్రం      


అంతేకానీ... తమ మధ్య కలిగింది అసలు ఆకర్షణో లేక మరేమిటో కూడా తెలియకుండా కొంతమంది చేసే తప్పుకు ప్రేమ అనే పేరు పెట్టి ప్రేమికులంటే అంతే... అందుకోసమే ప్రేమించుకుంటారు... అంటూ ఓ నిర్ధారణకు వచ్చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ప్రపంచంలోని మిగిలిన బంధాల్లో లోటుపాట్లు ఉన్నట్టే ప్రేమ బంధంలోనూ లోటుపాట్లు ఉండడం సహజమే.

ఎటొచ్చీ మిగిలిన బంధాల్లా కాకుండా పరిచయం లేని వారిమధ్య ఏర్పడే ప్రేమ బంధం అంటేనే అందరూ కాస్త జాగ్రత్తగా గమనిస్తారు. అందుకే ప్రేమ బంధం సఫలమైనా, విఫలమైనా అదో చరిత్రగా నిలిచిపోతుంది. సామాజిక విలువలకు కట్టుబడి మనస్ఫూర్తిగా ప్రేమ బంధాన్ని కొనసాగించగల్గినపుడు మిగిలిన అన్ని బంధాలకు లాగానే ప్రేమ బంధానికి సైతం అందరిలో గుర్తింపు, గౌరవం లభిస్తుందనే విషయాన్ని ప్రేమికులు సైతం గుర్తించగల్గితే... మేము ప్రేమిస్తున్నాం అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం ఉండదు.

వెబ్దునియా పై చదవండి