తెలిసేగా అవిశ్వాసం పెట్టారు

FileFILE
వార్త : స్పీకర్ సురేశ్ రెడ్డిపై శాసనసభలో టీడీపీ, తెరాస సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూడు వాణి ఓటుతో వీగిపోయింది.

చెవాకు : అధికార పార్టీకి శాసనసభలో పూర్తి మెజారిటీ ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే వీగిపోతుందని అందరికీ తెలిసిందేగా. ఈ పరిస్థితుల్లో ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సాధించిందేమిటి?

స్పీకర్‌ తీరుపై ఆగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నో మార్గాలున్నాయిగా. వాటిని వదిలి ఇలా చేయడం ద్వారా సభా సమయం మాత్రమే కాక ప్రజాధనం కూడా వృథా అవుతోందనే విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు.

అయినా ఇప్పటికే ఎంతో సమయాన్ని, ప్రజా ధనాన్ని వృథా చేసిన, చేస్తున్న మాకు ఇదో లెక్కా అని మీరు అనుకుంటున్నారేమో. మీరు ప్రజల్లో భాగమే కాబట్టి మీ సమస్యలు కూడా వారి సమస్యలే అనుకుంటున్నారేమో.

వెబ్దునియా పై చదవండి