వెకేషన్స్‌కి వెళ్లాలనుకునే వారికి ఇదొక పండగలాంటి వార్త. ఆ ప్రాంతంలో నివాసం ఉండాలనుకుంటే ఇల్లును ఇవ్వడమే కాకుండా ఖర్చులకు గానూ నెలకు సుమారు నలభై వేల రూపాయల డబ్బును కూడా ఇస్తారట. ఎక్కడ అని ఆశ్చర్యపోతున్నారా..అది ఒక చిన్న దీవి. గ్రీస్‌కు చెందిన యాంటికీతెరా ఐలాండ్. సుమారు 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ దీవి ప్రపంచానికి దూరంగా ఉంటుంది.
క్రీస్తు పూర్వం 100సంవత్సరాల నాటి కట్టడాలు కూడా అక్కడ కనిపిస్తాయట. పాతకాలం నాటి కంప్యూటర్‌లు దర్శనమిస్తాయి. జన సంచారం చాలా తక్కువ ఉండడంతో ఎలాగైనా జనసాంద్రతను పెంచాలనే ఉద్దేశంతో ఆర్థోడిక్స్ చర్చి కొత్త కుటుంబాలకు ఆహ్వానం పలుకుతోంది. అలాగే వారికి ఆర్థికంగా సాయం చేస్తామని తెలియజేస్తోంది. నివాసం ఉండేందుకు ఇంటితో పాటు వ్యవసాయం, వ్యాపారం చేసుకోవడానికి నెలకు 40 వేల 200 రూపాయలు ఇస్తుందట.