ఏ మాత్రం అవకాశమివ్వకుండా కీలక పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పాయింట్ల మధ్య అంతరం ఒకింత తగ్గినా ఒత్తిడికి లోనుకాకుండా తొలి రౌండ్‌లో 2-2-2తో ఆరు పాయింట్లు, రెండో రౌండ్‌లో 2-2-1తో ఐదు పాయింట్లు దక్కించుకున్నాడు.
ఈ విజయం తర్వాత భజరంగ్ పూనియా స్పందిస్తూ, ఈ విజయాన్ని భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి అంకితమిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటున్నాను. యోగీ బాయ్(యోగేశ్వర్ దత్) చెప్పినట్లుగానే ఈ ఆసియాడ్‌లో స్వర్ణం గెలిచాను. ఇది నా కెరీర్‌లోనే మరుపురాని పతకం. ఇక్కడ విజయం సాధిస్తే రానున్న టోక్యో(2020)లో పోటీలో ఉన్నట్లుగా భావిస్తున్నాను. ఇదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ నసాగించాలనుకుంటున్నాను. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా మరింత సిద్ధమవుతాను అని చెప్పుకొచ్చాడు.