80 సెకన్లలో ఇండియాకు స్వర్ణ పతకం... రెజ్లర్ సుశీల్ కుమార్ భేష్

గురువారం, 12 ఏప్రియల్ 2018 (17:25 IST)
ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి మరో స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. తన ప్రత్యర్థిని కేవలం 80 సెకన్ల వ్యవధిలో మట్టి కరిపించి టైటిల్ గెలుచుకున్నారు. 74 కేజీల ఈవెంట్‌లో సుశీల్ సౌతాఫ్రికాకు చెందిన  తన ప్రత్యర్థి జోహ‌నెస్ బోథాపై విజ‌యం సాధించాడు. కాగా కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశానికి ఇది 14వ స్వర్ణ పతకం.
 
ఇప్పటివరకూ భారతదేశం 29 పతకాలను సాధించింది. కాగా 50 మీటర్ల రిఫైర్ ప్రోన్‌లో తేజస్విని సావంత్ రజత పతకాన్ని సాధించింది. తద్వారా భారత్ ఖాతాలో మొత్తం 25 పతకాలు చేరాయి. ఇందులో 12 బంగారు, ఐదు రజతం, 8 కాంస్య పతకాలున్నాయి. ఇప్పటికే తేజస్విని మూడుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని, ఆరు పతకాలు సాధించింది. వీటిలో రెండు బంగారు, రెండు రజతం, రెండు కాంస్య పతకాలున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు