కామన్వెల్త్ గేమ్స్.. భారత్ ఖాతాలో 25 పతకాలు.. అదరగొడుతున్న హాకీ జట్టు

గురువారం, 12 ఏప్రియల్ 2018 (14:25 IST)
ఆస్ట్రేలియాలో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. 50 మీటర్ల రిఫైర్ ప్రోన్‌లో తేజస్విని సావంత్ రజత పతకాన్ని సాధించింది. తద్వారా భారత్ ఖాతాలో మొత్తం 25 పతకాలు చేరాయి. ఇందులో 12 బంగారు, ఐదు రజతం, 8 కాంస్య పతకాలున్నాయి. ఇప్పటికే తేజస్విని మూడుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని, ఆరు పతకాలు సాధించింది. వీటిలో రెండు బంగారు, రెండు రజతం, రెండు కాంస్య పతకాలున్నాయి.
  
 
మరోవైపు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 4-3తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ జట్టు పూల్-బిలో అగ్రస్థానాన్ని దక్కించుకుని సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో భారత జట్టు సెమీఫైనల్ మ్యాచ్ శుక్రవారం జరుగనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు