వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌.. మెరిసిన భారత అథ్లెట్లు.. పట్టు విడవని విక్రమార్కులు

సెల్వి

బుధవారం, 1 అక్టోబరు 2025 (19:21 IST)
Para Athletics Championships 2025
వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. పురుషుల ఎఫ్ 64 కేటగిరిలో సుమిత్ అంటిల్ జావెలిన్‌ను 71.37 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో తానే సృష్టించిన ఛాంపియన్‌షిప్ రికార్డ్(2023లో 70.83 మీటర్లు)ను తుడిచిపెట్టాడు. ఈ టోర్నీలో పసిడి హ్యాట్రిక్ కూడా కొట్టాడు.
 
సుమిత్ అంటిల్‌ రోడ్డు ప్రమాదంలో కాలును పోగొట్టుకున్నాడు. దీంతో రెజ్లర్ కావాలనుకున్న అతని కల చెదిరింది. అయితే పట్టువిడవకుండా.. 2017లో పారా అథ్లెట్‌గా కెరీర్ ప్రారంభించాడు. జావెలిన్ త్రోలో పట్టు సాధించి ఈ క్రీడల్లో దూసుకెళ్తున్నాడు. పురుషుల ఎఫ్ 44 జావెలిన్ త్రోలో సందీప్ సంజయ్ సర్గార్ స్వర్ణం.. సందీప్ సిల్వర్ మెడల్‌తో మెరిసారు. సంజయ్ 62.82 మీటర్ల త్రో వేయగా.. సందీప్ 62.67 మీటర్లు జావెలిన్ విసిరాడు. 
 
ఎడినిల్‌సన్ (బ్రెజిల్) బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు. నాలుగేళ్ల వయస్సులోనే కాలికి తీవ్రగాయం అయిన సుదీప్ కూడా తన క్రీడా జీవితంలో గెలిచాడు. ఒకవైపు పుణెలో డెలివరీ బాయ్‌గా పని చేస్తూనే శిక్షణ సాగించిన అతడు.. తొందరగానే ఆటపై పట్టు సంపాదించాడు. ప్రస్తుతం జావెలిన్ త్రోలో అదరగొట్టాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు