టోక్యో ఒలింపిక్స్‌లో సంచలనం 13 ఏళ్లలో స్వర్ణం.. కొత్త రికార్డ్

సోమవారం, 26 జులై 2021 (12:30 IST)
Nishiya Momiji
జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా టోక్యో ఒలింపిక్స్‌లో సంచలనం సృష్టించింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్‌లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. 
 
ట్రిక్స్ సెక్షన్‌లో 15.26 పాయింట్లు సాధించిన నిషియా..పసిడిని కైవసం చేసుకుంది. ఆమె ప్రస్తుత వయస్సు 13 ఏళ్ల 330 రోజులు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో మొట్టమొదటి వుమెన్స్ స్కేట్‌బోర్డింగ్ ఛాంపియన్‌‌గా నిలిచింది.
 
ఇంతకు ముందు బ్రెజిల్‌కి చెందిన రేసా లీల్ గోడ్డ్‌మెడల్‌ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఉంది. ఆమె 13 ఏళ్ల 203 వయస్సులో ఈ ఘనత సాధించింది. యూఎస్‌కి చెందిన డైవర్ మర్జోరీ గెస్ట్రింగ్, 1936 బెర్లిన్ గేమ్స్‌లో తన 13 ఏళ్ల 168 రోజుల వయసులో ఒలింపిక్ పతకం సాధించి, ఒలింపిక్ పతకం సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు