Yashtika: వెయిట్ లిఫ్టర్ మృతి.. 270 కిలోల బరువున్న రాడ్డు మెడపైనే పడింది.. (video)

సెల్వి

బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (22:06 IST)
Yashtika
వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ మహిళ మృతి చెందింది. 17ఏళ్ల వయస్సులోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. తన ఆశయం వైపు అడుగులు వేస్తూ.. ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఓ 17 ఏళ్ల యువ మహిళా పవర్ లిఫ్టర్ యష్టిక ఆచార్య ప్రాణాలు కోల్పోయింది. 
 
రోజూలాగే ప్రాక్టీస్ చేస్తున్న ఆమె జిమ్‌లో 270 కిలోల బరువున్న రాడ్డును ఎత్తబోయింది. ఎంతో కష్టపడి దాన్ని పైకెత్తగా.. ప్రమాదవశాత్తు అది జారి తన మెడపైనే పడింది. ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆమెను పరిశోధించిన వైద్యులు ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. 
 
గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణ పతక విజేతగా నిలిచిన ఆమె మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి. కూతురు మరణం గురించి తెలుసుకున్న యశ్తికా తల్లిదండ్రులు నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనలో ట్రైనర్‌కు గాయాలైనాయి.
 
జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేశామని, ఇది యష్టిక మరణానికి ప్రాక్టీస్ ప్రమాదమే కారణమని నిర్ధారించిందని నయా షహర్ పోలీస్ స్టేషన్ అధికారి విక్రమ్ తివారీ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబం కూడా ఎటువంటి కేసు నమోదు చేయలేదని, పోస్ట్‌మార్టం చేయించుకోవాలని కోరుకోవడం లేదని తివారీ అన్నారు. 
 
అంత్యక్రియల కోసం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ స్థాయి అథ్లెట్ విషాద మరణం ఆమె స్వగ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటీవల గోవాలో జరిగిన 33వ జాతీయ బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో యశ్తికా ఆచార్య రెండు విభాగాల్లో బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది.

రాజస్థాన్ లోని బికనీర్లో యస్తిక ఆచార్య (17) అనే వెయిట్ లిఫ్టర్ ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయారు.

కోచ్ సమక్షంలో జిమ్లో 270కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా, చేతిలో నుంచి జారిన బరువైన రాడ్డు ఆమె మెడపై పడటంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు.

గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్ ఆమె… pic.twitter.com/dhTtg7bWCr

— greatandhra (@greatandhranews) February 19, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు