రాజస్థాన్‌లోని జైన్ నామ్‌కీన్ భండార్ అనే స్టాల్ నుండి కచోరి, మిర్చి బడే, సమోసాలను కొనుగోలు చేశాడు. ఇందులో సమోసాలో బ్లేడ్‌ను చూసి షాకయ్యాడు. ఇది చివరికి ఆందోళనకరమైన విషయంగా మారింది.
"నేను ఇంట్లో తిందామని సమోసా విరుస్తున్నప్పుడు, లోపల బ్లేడ్ ముక్క కనిపించింది" అని వర్మ మీడియాతో తెలిపాడు. దీనిపై పోలీసులకు, ఆహార శాఖకు సమాచారం ఇచ్చానని పేర్కొన్నాడు.