తన ప్రియుడితో కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి... ఎక్కడ?

ఠాగూర్

శుక్రవారం, 24 జనవరి 2025 (09:18 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్ నగరంలో దారుణం ఒకటి వెలుగు చూసింది. ఏమాత్రం కనికరం లేని ఓ కసాయి తల్లి తన ప్రియుడుతో కన్నబిడ్డపై అత్యాచారం చేయించింది. మాతృప్రేమ సిగ్గుపడే ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సమీపంలో ఉన్న ఫలోడీలో వెలుగులోకి వచ్చింది. 
 
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తన తల్లి తన సొంత ప్రేమికుడుతో కలిసి తప్పుడు పను చేయించేదని పేర్కొంది. తనతో బలవంతంగా మద్యం తాగించిందని, ఆ తర్వాత ఆమె ప్రియుడుతో కలిసి అత్యాచారం చేయించిందని ఆరోపించారు. అమ్మ ప్రియుడు ఇంటికి వచ్చినపుడల్లా ఈ తంతు జరిగేదని పోలీసులకు చెప్పింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక తల్లితో పాటు ఆమె ప్రియుడుని కూడా అరెస్టు చేశారు. 
 
చెన్నై మసాజ్ సెంటరులో వ్యభిచారం... పోలీసులు వెళ్లి చూడగా... 
 
దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో చెన్నై మహానగరం ఒకటి. ఇక్కడ అనేక అంసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని చెన్నై పోలీసులు శక్తిమేరకు అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ కొందరు పోలీసుల కళ్లుగప్పి ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా చెన్నై అన్నానగరులోని మసాజ్, స్పా సెంటరులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రంలో పడుపు వృత్తిలో నిమగ్నమైవున్న ముగ్గురు యువతులకు విముక్తి కల్పించారు. అలాగే, ఈ స్పా సెంటర్ యజమానురాలు 30 యేళ్ల ప్రేమ అనే మహిళను అరెస్టు చేశారు. ఆమెకు సహకరిస్తూ వచ్చిన బ్రోకర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం చెన్నై మహానగరానికి వచ్చే అమ్మాయిలు, అందమైన మహిళలను ఉపాధి పేరుతో చేరదీసి, ఆ తర్వాత మెల్లగా మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. మరికొందరు యువతులు అయితే, సినిమా, టీవీల్లో వేషాల కోసం చెన్నైకు వచ్చి మధ్యవర్తుల చేతికి చిక్కి వ్యభిచార కేంద్రాల్లో పడుపువృత్తి చేస్తున్నారు. ఇలాంటి వాటిపై పక్కా సమాచారం అందుకునే పోలీసులు... ఆకస్మిక దాడులు చేస్తూ అక్కడ వ్యభిచార వృత్తిలో ఉండే అమ్మాయిలు, మహిళలను రక్షించి, ప్రభుత్వ మహిళా సంరక్షణా కేంద్రాలకు తరలిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు