ప్రో కబడ్డీ 2017: గుజరాత్‌ను చిత్తు చేసిన పాట్నా పైరేట్స్

ఆదివారం, 29 అక్టోబరు 2017 (10:40 IST)
ప్రొ కబడ్డీలో కొత్త రికార్డు పాట్నా పైరేట్స్ నెలకొల్పింది. చెన్నై వేదికగా జరిగిన ప్రొ కబడ్డీ ఫైనల్ పోటీలో పాట్నా పైరేట్స్‌ హ్యాట్రిక్ సాధించింది. ఐదో సీజన్‌‌లో అద్భుత విజయాలు సొంతం చేసుకుంది. ఈ ఫైనల్లో గుజరాత్‌ను పాట్నా చిత్తుగా ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఫలితంగా పాట్నా జట్టు వరుసగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్ 'డుబ్కీ కింగ్' పర్దీప్‌ నర్వాల్‌ 19 రైడ్‌ పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఫలితంగా పాట్నా పైరేట్స్ జట్టు 55-38 తేడాతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకుంది. అదేసమయంలో బలమైన జట్టుగా బరిలోకి దిగిన గుజరాత్‌ టీమ్.. వరుస తప్పిదాలతో టైటిల్‌ను కోల్పోయింది. పాట్నా టీమ్‌లో పర్దీప్‌తో పాటు విజయ్‌ 7, జైదీప్‌ 5 పాయింట్లు సాధించారు. గుజరాత్‌లో సచిన్‌ 11, మహేంద్ర రాజ్‌పుత్‌ 5, చంద్రన్‌ రంజిత్‌ 4 పాయింట్లు సాధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు