PV Sindhu: బ్యాడ్మింటన్‌కు బ్రేక్ ఇస్తున్నాను.. కారణం అదే.. పీవీ సింధు

సెల్వి

మంగళవారం, 28 అక్టోబరు 2025 (09:57 IST)
PV Sindhu
భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాడ్మింటన్‌కు స్వల్ప విరామం తీసుకుంది. పాదం గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీ తర్వాత సింధు మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టలేదు. ఈ టోర్నీలో సింధు సెమీస్‌కే పరిమితమైంది. సింధు తాజా నిర్ణయంతో అర్కిటెక్ ఒపెన్, డెన్మార్క్ ఒపెన్, ఫ్రెంచ్ ఒపెన్‌కు దూరం కానుంది.
 
ప్రముఖ డాక్టర్ పార్ధివాలాతో పాటు తన టీమ్‌ సూచనలతో ఈ ఏడాదిలో మిగిలిన అన్ని బీడబ్ల్యూఎఫ్ టోర్నీల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. యూరోపియన్ టోర్నీకి ముందు అయిన పాదం గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. 
 
రికవరీ ట్రైనింగ్ ఇప్పటికే మొదలైంది. డాక్టర్ వేన్ లంబార్డ్ పర్యవేక్షణలో నిషా రావత్ సాయం, తన కోచ్ ఇర్వాన్ స్యా గైడెన్స్‌లో కోలుకుంటున్నానని.. తనపై వారికున్న నమ్మకం తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోందని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు